క్రెడిట్ కార్డు అనేది ప్లాస్టిక్ కార్డు, ఇది కార్డుదారుల ఆర్థిక సంస్థ నుండి, ఒక నిర్దిష్ట పరిమితి వరకు, కొనుగోళ్లు చేయడానికి లేదా డబ్బులను విత్డ్రా చెయ్యడానికి అనుమతిస్తుంది.క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నప్పుడు, కార్డు సొంతదారులు తప్పనిసరిగా రుణాలుతీసుకుంటాడు, అది వడ్డీతో పాటు, ఇతర రుసుములు తిరిగి చెల్లింపు చెయ్యాలి.

క్రెడిట్ కార్డులు వ్యక్తిగతంగా మరియు ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడంలో సులభతరంగా మరియు సెక్యూరిటీ వల్ల ఎక్కువగా ఉపయోగించబడతాయి. డబ్బులు తిరిగి సంపాదించడం, పాయింట్లను కూడబెట్టడం లేదా విమాన టికెట్ల పైన రాయితీ పొందడం వంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయి.ఏది ఏమైనప్పటికీ,వాటిని ఉపయోగిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి,ఎందుకంటే అవి కొన్ని రకాల ప్రమాదాలకు సైతం దారితీస్తాయి.